హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా సహకరించాలి'

BDK: గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులకు మంగళవారం సూచించారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో పండుగను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. భక్తులకు అందించే ప్రసాదాల్లో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా సహకరించాలని అన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.