MHBD: వరి పైరుకు పురుగు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతతో ధరంసోతు రాముడు(35) పొలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం MHBD జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయరు.
తెలంగాణ
పంటకు పురుగు మందు స్ప్రే చేస్తూ రైతు మృతి


