హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మహత్యాయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు

ADB: జైనథ్ మండలంలోని సత్నాల బ్రిడ్జి వద్ద అనారోగ్యంతో మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన గులాబ్ తండావాసి గ్రామానికి చెందిన రాథోడ్ వికాస్‌ను బ్లూకోట్స్ సిబ్బంది సందీప్, మాధవ్ వెంటనే కాపాడారు. డయల్-100 సమాచారంతో క్షణాల్లో స్పందించి ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.