GDWL: ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలకు ధ్రువీకరణ ముద్రలు తప్పనిసరి అని జిల్లా తూనికలు, కొలతల అధికారి రవీందర్ తెలిపారు. గద్వాల్ జిల్లా కేంద్రంలో మటన్, చికెన్ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముద్రలు లేని త్రాసులు వాడుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. తూకంలో తేడాలొస్తే చర్యలు తప్పవని, దుకాణాల్లో ప్రమాణ బరువులు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు'


