హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాచమల్లు వ్యాఖ్యలపై యాదవ సంఘం ఆగ్రహం

KDP: పొద్దుటూరులో వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బుర్రి రెడ్డయ్య యాదవ్ తీవ్రంగా స్పందించారు. బీసీ నాయకుడు చల్లా రాజగోపాల్‌పై బెదిరింపు వ్యాఖ్యలను ఖండించారు. నందం సుబ్బయ్య హత్య కేసును సిట్‌తో విచారించి, బెదిరింపు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.