SKLM: నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వై.వి. మురళీకృష్ణ, ఏడీఏ శారద రైతులకు సూచించారు. మెలియాపుట్టి మండలం పడ్డ, చిన్న సున్నాపురం గ్రామాల్లో మంగళవారం వరి పంటలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీపై ఇస్తామన్నారు. సెప్టెంబర్ 15లోపు పంట నమోదు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంట నమోదు పూర్తి చేయాలి'


