హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.7.98 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం: ఎమ్మెల్యే

NLR: రెండేళ్ల కుటమి ప్రభుత్వంలో రూ. 7.98 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చి మండలం పంచేడు గ్రామంలో ఆమె మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు లక్షల పెన్షన్లను అందజేయనున్నామని చెప్పారు. ఇళ్ల స్థలాల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలతో రెండు సంవత్సరాలుగా సమస్యలను పరిష్కరించలేకపోతున్నామన్నారు.