సత్యసాయి: రామగిరి మండలం పేరూరు ప్రాజెక్టులో రూ.35 లక్షల రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులతో ఆనకట్ట, స్పిల్‌వేపై విద్యుత్, ఫ్లడ్‌లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని టీడీపీ నాయకులు, అధికారుల సమక్షంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ప్రాజెక్టులో అసాంఘిక కార్యకలాపాలు, ధ్వంసాన్ని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేరూరు ప్రాజెక్టుకు కొత్త శోభ


