హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేతనాలు చెల్లించాలి: సిఐటీయూ

BPT: ఈపురుపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు, అలవెన్సులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్. బాబురావు డిమాండ్ చేశారు. పంచాయతీకి పర్మినెంట్ సెక్రెటరీని నియమించాలని, 2024 నుండి జీతాల నిధుల అక్రమాలపై విచారణ జరపాలని కోరారు. ఇన్ఛార్జ్ సెక్రెటరీ హామీతో కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నారన్నారు.