హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాకుర్రు కనకదుర్గమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం సాకుర్రులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాయుడు రామకృష్ణ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. తాము అమ్మవారిని కోరిన కోర్కెలు నెరవేరినందుకు ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశామన్నారు. ఆలయ పండితులు దాతకు ఆశీర్వచనం అందజేశారు.