హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు

ASR: పాడేరు కలెక్టరేట్‌లో 11మంది లోకోమోటర్ దివ్యాంగులకు మంగళవారం రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలను కలెక్టర్ నిశాంతి పంపిణీ చేశారు. అర్హులైన దివ్యాంగులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ ఆన్‌లైన్ దరఖాస్తులు, ఇంటర్వ్యూల ద్వారా 11 మందిని పారదర్శకంగా ఎంపిక చేసింది. ఈ వాహనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.