హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌జైలులో న్యాయ సేవా అధికారుల పరిశీలన

NGKL: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నిహారిక మంగళవారం నాగర్‌కర్నూల్ సబ్‌జైలును సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వసతులు, ఆహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించి జైలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.