హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్తా చాటిన నిజామాబాద్ పోలీస్ సిబ్బంది

NZB: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన 42.195 కి.మీ ఫుల్ మారథాన్‌ను నిజామాబాద్ పోలీస్ కానిస్టేబుళ్లు పిల్లి మహిపాల్, సతీష్ విజయవంతంగా పూర్తి చేసి మెడల్స్ సాధించారు. మహిపాల్ 5 గంటల 05 నిమిషాల 41 సెకన్లలో, సతీష్ 5 గంటల 55 నిమిషాల్లో పరుగు పూర్తి చేశారు. వారిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.