హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏస్సైని సన్మానించిన ఎస్పీ

GNTR: పెదకాకాని మండలం గొల్లమూడికి చెందిన నడింపల్లి రవికుమార్ పోలీస్ శాఖలో 43 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేశారు. కానిస్టేబుల్‌గా ప్రస్థానం ప్రారంభించి ఏస్సై స్థాయి వరకు వివిధ హోదాల్లో ఆయన సేవలందించారు. పదవీ విరమణ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సన్మానించారు.