PLD: నరసరావుపేటలో కలెక్టర్ కృతిక శుక్ల అధ్యక్షతన డా. ఎన్టీఆర్ వైద్య సేవల డిసిప్లినరీ కమిటీ సమావేశం జరిగింది. 152 ఫిర్యాదులను సమీక్షించగా, నగదు వసూలు తదితర ఆరోపణలపై 8 ఫిర్యాదులు చర్చించారు. రెండు ఫిర్యాదులపై విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. రోగుల నుంచి ఎలాంటి నగదు వసూలు చేయకూడదని ఆసుపత్రులకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై సమీక్ష


