హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్లక్ష్యానికి షోకాజ్ నోటీసులు

కర్నూలు కార్పొరేషన్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై కమిషనర్ చల్లా ఓబులేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు, నలుగురు సచివాలయ ఉద్యోగులకు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా స్పందించకపోతే ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.