హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన

KRNL: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. AP JAC అమరావతి నాయకుల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.