హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎఫ్‌ఐఆర్‌కు నిరసనగా కాంగ్రెస్ ధర్నా.!

KMM: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ.. తిరుమలాయపాలెంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్ నేతృత్వంలో నిరసన తెలిపి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. రాహుల్ గాంధీని 'శుద్ధీకరణ' నెపంతో అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అశోక్ డిమాండ్ చేశారు.