ELR: ఎక్సైజ్ కేసులలో పాత నేరస్తుడైన ఓ వ్యక్తిని చాట్రాయి మండల తహశీల్దార్ ఎదుట మంగళవారం బైండోవర్ చేసినట్లు నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. ఈ బైండోవర్ ఏడాది కాలం పాటు ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయలు జరిమానా తో పాటు శిక్షలు కూడా తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బైండోవర్ అతిక్రమిస్తే కఠిన చర్యలు


