హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి సూపరింటెండెంట్ రిలీవ్‌కు విజ్ఞప్తి

SRD: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ విధుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. వ్యక్తిగత కారణాలతో తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ డీఎంహెచ్‌వోకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన అభ్యర్థన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.