ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2,53,845 మంది లబ్ధిదారులకు రూ.111.60 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్మును మంగళవారం అందజేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక ఆదివారపుపేట, రజకులపేట స్వర్ణవార్డు సచివాలయ పరిధిలో కలెక్టర్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పింఛను నగదును అందజేశారు. వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రూ.111.60 కోట్లతో పింఛన్ల పంపిణీ


