హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దాడులతో బీజేపీని భయపెట్టలేరు'

BHPL: నాంపల్లిలోని BJP తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ.. ఇవాళ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో BJP నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు నిషీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, రైతులు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం అమానుషమన్నారు. దాడులతో బీజేపీని భయపెట్టలేరని స్పష్టం చేశారు.