హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచినీరు వృథా..రహదారులు జలమయం

KDP: సిద్ధవటం మండలం జ్యోతి గ్రామం పశువైద్యశాల సమీపంలోని మంచినీటి ట్యాంక్‌ వద్ద గత కొన్ని రోజులుగా తాగునీరు వృథాగా పోతుండటంతో రహదారులు జలమయంగా మారుతున్నాయి. ట్యాంక్‌ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి లీకేజీని అరికట్టి, పరిసరాలను శుభ్రం చేయాలని వారు కోరారు.