హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్క్‌లో లోపించిన పరిశుభ్రత

ASR: కొయ్యురు మండలం మంప గ్రామంలోని అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పార్క్ పరిసరాల్లో పరిశుభ్రత లోపించినట్లు కనిపిస్తోంది. పార్క్‌లోని నీటి ప్రాంతంలో కలుపు మొక్కలు పెరగడంతో పాటు, మేకలు సంచరిస్తున్నాయి. పర్యాటకులు, సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.