కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని గైగోలుపాడులో రమణయ్యపేట-04 సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని రూ.10 లక్షల పంచాయతీ నిధులతో పూర్తి చేశారు. అలాగే రూ.13 లక్షలతో వెల్‌నెస్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తిచేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


