హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తప్పవు : MRO

KDP: పెన్నానది నుంచి అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ విజయ్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ..ఉచిత ఇసుక పేరుతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు.అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రహదారులు పూడ్చివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.