MBNR: హన్వాడ మండల కేంద్రానికి చెందిన సీనియర్ BRS నాయకుడు కొండ లక్ష్మయ్య గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లికా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కొండ లక్ష్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి


