హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచినీటి కష్టాలు తీరడంతో గ్రామస్తుల హర్షం..!

BDK: దమ్మపేట (M) గోపాలపురంలో పదిహేనేళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం ఇవాళ లభించింది. ఏళ్ల తరబడి గుక్కెడు నీటి కోసం అల్లాడిన ఆ గ్రామ ప్రజల కష్టాలను పంచాయతీ పాలకవర్గం తమ సంయుక్త కృషితో దూరం చేసింది. నూతన బోరు డ్రిల్లింగ్ పనులు విజయవంతం కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.