హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆల్‌టైమ్-11.. ధోనీ, రోహిత్‌లకు దక్కని చోటు

పుజారా తన ఆల్‌టైమ్ టెస్టు ప్లేయింగ్-11ను ప్రకటించాడు. ఓపెనర్లుగా ద్రవిడ్, సెహ్వాగ్‌లను ఎంపిక చేసిన అతడు.. మూడో స్థానంలో తనను తాను ఎంపిక చేసుకున్నాడు. నాలుగో స్థానంలో సచిన్, ఐదో స్థానంలో కోహ్లీ, ఆరులో లక్ష్మణ్, వికెట్‌కీపర్‌గా పంత్‌ను తీసుకున్నాడు. బౌలర్లుగా జడేజా, అశ్విన్, బుమ్రా, షమీలకు అవకాశం ఇచ్చాడు. ఈ జట్టులో ధోనీ, రోహిత్‌కు చోటు కల్పించలేదు.