హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొమ్మిదో రోజూ చేరిన హైకోర్టు బెంచ్ దీక్షలు!

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. జిల్లా బార్ అసోసియేషన్ చేపట్టిన ఆందోళన తొమ్మిదో రోజూ కొనసాగింది. న్యాయవాదులు విధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం దీక్షలో పలువురు న్యాయవాదులు మద్దయ్య, జి.మురళీకృష్ణ, శరభయ్య, ఎం.శ్రీకాంత్, పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని న్యాయవాదులు తెలిపారు.