హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాజీపేట హైవేపై రోడ్డు ప్రమాదం.!

KDP: ఖాజీపేట మండల పరిధిలోని నందిపాడు కాలనీ సమీపంలో కడప - కర్నూలు జాతీయ రహదారిపై మంగళవారం కారును ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాదు నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.