సత్యసాయి: జగరాజుపల్లి SC కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు NTR భరోసా పింఛన్లను స్వయంగా అందజేశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని స్పష్టం చేశారు. ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
స్వయంగా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్


