హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేల పురోగతిపై కేంద్ర మంత్రి సమీక్ష

GNTR: గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లో జాతీయ రహదారుల పెండింగ్ పనులు, ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో NHAI రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్లతో సమావేశమైన మంత్రి, రహదారి అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.