హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌతులపూడిలో నూతన మీటింగ్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కాకినాడ: రౌతులపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల స్థాయి సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు నూతన మీటింగ్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.