హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన గుండంచర్ల, సుంకేసుల గ్రామాల పింఛన్‌దారులకు కలెక్టర్ విజయ సునీత దేవరాజుగట్టు ప్రభుత్వ పాఠశాల వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే పుచ్చకాయలపల్లి, స్వర్ణ గ్రామాల పింఛన్‌దారులకు స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద, గొట్టిపడియ గ్రామ పింఛన్‌ దారులకు కొలభీమునిపాడు స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద పింఛన్లు అందజేశారు.