హైదరాబాద్: 28°C
తెలంగాణ

TGPSC ఉచిత కోచింగ్ దరఖాస్తులు ఆహ్వానం

BDK: జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు TGPSC గ్రూప్‌-I, II, III, IV పరీక్షల కోసం ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి విజయలక్ష్మి తెలిపారు. మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉండగా,సెప్టెంబర్‌ 1 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తరగతులు సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆమె తెలిపారు.