సంగారెడ్డి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) సెక్షన్లు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటాయని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.
తెలంగాణ
పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ


