VZM: వంగరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కారు బాలయ్య (64) సోమవారం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పని చేస్తుండగా అలసటగా అనిపించడంతో సిబ్బందికి చెప్పి ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలగా, కుటుంబ సభ్యులు పరిశీలించేసరికే మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో వేతనదారుడు మృతి


