హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎల్లుప్పిలో ఎలుపమ్మ మహోత్సవం

VSP: సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామదేవత ఎలుపమ్మ వారి మహోత్సవం మంగళవారం ఘనంగా జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు నిర్వహిస్తారని, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు.