హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రుద్రభూమికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రుద్రభూమి అభివృద్ధి పనులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భూమిపూజ నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి రూ.4 లక్షలు, గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.10 లక్షలు, దాతల సహకారంతో రూ.36 లక్షలు సమకూర్చి మొత్తం రూ.50 లక్షలతో రుద్రభూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.