హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్ భవన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

GNTR: రాజధాని అమరావతిలో గవర్నర్ నివాస సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రాజ్‌భవన్, దర్బార్ హాల్‌తో పాటు ఇతర నిర్మాణాల కోసం రూ.212.22 కోట్లతో గతంలో జారీ చేసిన పరిపాలనా అనుమతులకు ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ సోమవారం జీవో-1100 విడుదల చేశారు.