హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఛైర్మన్ తనిఖీలు

ASR: పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ డా. దొన్నుదొర సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. సీఎం చంద్రబాబు ఇటీవల సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మరుగుదొడ్లు, తాగునీరు, సిబ్బంది తీరును పరిశీలించి మెరుగుదలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.