ASR: అరకులోయ మండలంలో సెప్టెంబర్ నెలకు 6,277 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 2,71,96,000 మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న స్వర్ణ గ్రామ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని అన్నారు. కావున లబ్ధిదారులు తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మండలానికి రూ. 2.72 కోట్లు మంజూరు


