హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆచంటలో దొంగల హల్ చల్

W.G: ఆచంట మండలం వేమవరం జగనన్న కాలనీలోని దుర్గాదేవి అనే మహిళ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన దుండగులు రూ.లక్ష నగదు, రెండు కాసుల బంగారాన్ని అపహరించుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆచంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.