హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడుగంటిన కాకతీయుల కాలం నాటి మెట్ల బావి

WGL: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని కాకతీయుల కాలం నాటి చారిత్రక మెట్ల బావి నీరులేక వెలవెలబోతోంది. రుద్రమదేవి స్నానమాడినట్లు చెబుతున్న ఈ బావి గతంలో వర్షాకాలంలో నిండుకుండలా దర్శనమిచ్చేది. వర్షాభావంతో పాటు చుట్టుపక్కల లోతైన బోర్ల కారణంగా భూగర్భజలాలు తగ్గడం కూడా బావి ఎండిపోవడానికి కారణమని స్థానిక ప్రజలు చెబుతున్నారు.