ASR: అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ కడరేవు, కర్రిగూడ, మర్రిబంద, కల్యాణగుమ్మి తదితర మారుమూల గ్రామాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దేవదాసు సోమవారం పర్యటించారు. ప్రజలతో మాట్లాడి రోడ్లు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, అంగన్వాడీలు, వైద్యం, రవాణా సదుపాయాలను పరిశీలించారు. అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందని కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటన


