హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష కుటుంబానికి అండగా ఎమ్మెల్యే జారే

BDK: ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకుంది. శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరామర్శించి, రాత్రంతా వారి వద్దే ఉండి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.