హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదవీ విరమణ పొందిన పోలీసులకు ఎస్పీ సన్మానం

BHNG: భువనగిరి టౌన్‌ పీఎస్‌కు చెందిన ఎస్‌ఐ రామకృష్ణరెడ్డి, ఏఎస్‌ఐ వీరేశం పదవీ విరమణ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌ వారిని ఘనంగా సన్మానించారు. అంకితభావం, నిజాయితీతో అందించిన సేవలను అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవా స్ఫూర్తి యువ సిబ్బందికి ఆదర్శమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు.