హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మౌలిక వసతుల పరిశీలన

ASR: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ముంచింగిపుట్టు ఎస్సై పీ.నాని, ఎంపీడీవో కే.ధర్మారావు, పంచాయతీ కార్యదర్శితో కలిసి సోమవారం బంగారుమెట్ట పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను తనిఖీ చేశారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.