హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరచింతకు పూర్వ వైభవం కల్పించాలని వినతి

WNP: నియోజకవర్గాల పునర్విభజనలో అమరచింతకు పూర్వ వైభవం కల్పించాలని అమరచింత డెవలప్‌మెంట్‌ ఫోరం సభ్యులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. గద్వాల పర్యటన ముగించుకుని అమరచింత మీదుగా నారాయణపేట వెళ్తున్న మంత్రిని వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఫోరం సభ్యులు సత్యంధర్‌, అంజి, కోరి శ్రీనివాసులు, ప్రశాంత్‌ పాల్గొని సమస్యను పరిశీలించాలని కోరారు.